Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందుకూరు దేవదాసు, జిల్లా కార్యదర్శి రామస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం బంధనపల్లి, కొత్తూరు, సూర్య తండ, ఏకే తాండ, పెర్కవేడు, గట్టికల్, ఉకల్, కొండాపురం పాఠశాలల్లో డీటీఎఫ్ సభ్యత్వ నమోదు గురించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరేండ్లుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించకుండా, మూడేండ్లుగా బదిలీలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వ 27సెలవులు వర్తింపచేసి, వారి సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని వ్యాఖ్యానించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, దాన్ని అధిగమించడానికి పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో జే లింగారెడ్డి, మండల శాఖ అధ్యక్షుడు సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, కుమారస్వామి, మధుకర్, సమ్మయ్య, రాంకిశోర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.