Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
మండల కేంద్రంలో రోడ్డుకిరువైపుల చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్న తమకు బాసటగా నిలువాలని చిరువ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సర్పంచ్ యమునరంజిత్రెడ్డి, కార్యదర్శి గోవిందరాజులకు వినతిపత్రమిచ్చారు. గ్రామపంచాయతీ పాలకవర్గం రోడ్డుకు ఇరువైపుల డబ్బాలు, తోపుడు బండ్ల తొలగింపును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైనేజి ఆవలకు దుకాణాలను పెట్టుకునేలా వెసులుబాటు కల్పించేలా నిర్ణయం తీసుకుని వ్యాపారులకు బాసటనివ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు యాకయ్య, కార్యదర్శి రాములు, సునిల్, అక్బర్, సదయ్య, శ్రీశైలం, శ్రీహరి, సారక్క, చాంద్మియా, అమీర్ తదితరులు పాల్గొన్నారు.