Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
కొండాపూర్లోని డంపింగ్ యార్డు, పల్లె ప్రకతి వనం, అవెన్యూ ప్లాంటేషన్, క్రిమిటోరియం, కమ్యూనిటీ ప్లాంటేషన్, నర్సరీలను శుక్రవారం వరంగల్ డీపీఓ ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశాడు. తదనంతరం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల, ఉపాధిహామీ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించి పచ్చదనం పరిశుభ్రతపై చర్చించారు. గ్రామ పంచాయతీలలో పచ్చదనం పరిశుభ్రతపై ఎక్కువ దష్టి పెట్టాలన్నారు. శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, నర్సరీల పెంపకం, పల్లె ప్రకతి వనాలు, వాటి నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా చూడాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో గ్రామస్తులను చైతన్యపరిచి వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, మొదలగు ప్రాంతాల వద్ద పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా జరిగేలా చూడాలన్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజరు కుమార్, ఎంపీఓ కూచన ప్రకాష్, మండలంలోని గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.