Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
టీఎస్ ఆర్టీసీ కార్గోతో ఒప్పందం చేసుకున్నట్టు సరుకు రవాణా రంగంలో వ్యాపారులకు మద్య అనుసంధాన కర్తగా సర్వీసులు అందిస్తున్న లారీవాలా డాట్కాం సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్‌రావు తెలిపారు. శుక్రవారం కేయూ క్రాస్‌రోడ్ గోపాల్‌పూర్‌లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్గో సర్వీసులను ఇక నుంచి తమ వెబ్సైట్లో బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించామన్నారు.
కార్గో సేవలను తమ ఇంటి నుంచి లేదా ఆఫీస్ నుంచి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. రిటన్ లోడ్ బుకింగ్ సదుపాయం కూడా కల్పించినట్టు పేర్కొన్నారు. ఈ సేవలను వ్యాపారులు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒకే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా లారీ వాళ్ళ ఆన్లైన్ డాట్ కం నుంచి ఆర్టీసీ కార్గో సేవలు నిరంతరం పొందవచ్చునని తెలిపారు. ఆర్టీసీతో ఒప్పందంతో జాయింట్ ఆపరేషనల్ బిజినెస్ ద్వారా కార్గో సేవలను అన్ని పట్టణాలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. త్వరలో మహారాష్ట్ర ఆర్టీసీ కార్గో, ఏపీఎస్ఆర్టీసీ కార్గో తో కలిసి పని చేయనున్నట్టు పేర్కొన్నారు. దీంతో మూడు రాష్ట్రాల్లో కార్గో వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ సంస్థను 2017లో స్థాపించి దేశవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా ఏజెంట్స్ మిడిల్ మెన్ లేకుండా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత ఒప్పందాల ద్వారా లాజిస్టిక్స్ రంగంలో కొరత ఎక్కువగా ఉన్నట్లు, దీనిని ఎంబీఏలో పాఠ్యాంశంగా యూనివర్సిటీల్లో బోధించినట్టయితే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒప్పందానికి సహకరించిన టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.