Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృథాగా పంట చేల్లోకి నీరు... నీరు రాకుండా అరికట్టాలని రైతుల వేడుకోలు
నవతెలంగాణ-చిట్యాల
ఎస్సారెస్పీ డీబీఎం-38 కెనాల్ ద్వారా వచ్చే నీరు కాలువలకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో వృథా నీరు తమ పంట పొలాలకు చేరి తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ మండలంలోని కైలాపూర్ గ్రామానికి చెందిన రైతులు దుస్థితి. మొన్నటి వరకు తీవ్రమైన వర్షాల వల్ల తమ భూములు జాలు పడ్డాయని, అనవసర సమయంలో కెనాల్ నీటిని వదలడంతో కాలువలు సరిగా లేక మరమ్మతులు చేపట్టకపోవడంతో నీటి ప్రవాహానికి కాలువలు తెగుతున్న పరిస్థితి. కాలువ ద్వారా నీరు వృథాగా వచ్చి తమ వ్యవసాయ భూముల్లో చేరి వందల ఎకరాల్లో పత్తి పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు వర్షాలతో పంట నష్టం వల్ల కొద్దికొద్దిగా తే రుకుంటున్న రైతులకు అనవసర సమయాల్లో కాలువ ద్వారా నీటిని వదలడంతో కాలువలు నిండి పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత శాఖ అధికా రులు స్పందించి తెగిన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు.