Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇబ్బందులు పడుతున్న పాదచారులు
- రైల్వే అధికారులు స్పందించాలని వేడుకోలు
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
జంట పట్టణాలైన స్టేషన్‌ఘన్‌పూర్- శివునిపల్లి మధ్య దశాబ్దాల కిందట రైల్వే గేటు నిర్మించారు. వాహనాల రద్దీ నియంత్రణలో భాగంగా ప్రజల సౌకార్యర్థం ఫ్లై ఓవర్ బ్రిడ్జీ ఏడాది కిందట నిర్మించారు. ప్రయాణికులకు మరింత వీలుగా అండర్ బ్రిడ్జీ కూడా నిర్మించారు. ఇటీవల రైల్వే ఉన్నతాధికారుల అదేశాలమేరకు రైల్వే గేటును పూర్తిగా మూసివేసి, ఎలాంటి రాకపోకలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
పాలకుర్తి, జఫర్‌గఢ్, ఉప్పుగల్, పరిసర ప్రాంతాలకు తరచూ ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జీ తరువాత ఈ అండర్ బ్రిడ్జీయే దిక్కు. ఈ అండర్ బ్రిడ్జీ నుంచి సా యంత్రమైతే రహదారి చిమ్మని చీకట్లు కమ్ముకోవడంతో పాదచారులు జంకుతు న్నారు. దీనికి తోడు అండర్ బ్రిడ్జీలో సీసీ రోడ్డు కూడా నాసిరకం పనులతో చేపట్టడంతో వేసిన కొద్ది రోజు ల్లోనే అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడితే నీరు నిలిచే అవకాశం కూడా ఉంది. పూర్తిగా గేటు మూసివేయడంతో పాదా చారులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలైతే అటుగా వెళ్ళాలంటేనే భయబ్రాంతులకు లోనవుతున్నారు. సాయంత్రం ఆరు గంటలకే ఆ రహదారి అంధకారం అవుతుండ టంతో, చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లాలంటే ఈ అండర్ బ్రిడ్జీ నుంచే దగ్గరగా ఉంటుంది. బ్రిడ్జీ ద్వారా గానే రాత్రి పూట చాలా మంది గ్రామాలకు చేరుకుం టారు. ఈ క్రమంలో రాకపోక లకు సులువుగా ఉండేలా తక్షణమే రైల్వే ఉన్నతాధికా రులు, ప్రజాప్రతి నిధులు స్పందించి విద్యుద్ధీపాలు ఏర్పాటు చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.
అటుగా నడవాలంటేనే భయం : కె సమ్మక్క
బ్రిడ్జీ మీదుగా రాతి సమయాల్లో నడవాలంటేనే ఇబ్బందిగా ఉంది. గేటు మూసివేయడంతో కష్టంగా మారింది. అధికారులు సమస్య పరిష్కరించాలి.
వద్ధులకు తీవ్ర ఇబ్బంది. : పి గోపాల్
నాకు తెలిసినప్పటికీ గేటు దాటాల్సి ఉండేది. ఇప్పుడు గేటు మూస వేయ డంతో ఇబ్బంది అవు తుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జీ నిర్మించాలి.
జీవనోపాధిపై దెబ్బపడింది
రైల్వే గేటు మూసివేయడంతో తమ జీవనోపాధిపై దెబ్బపడింది. ఎంతో కాలంగా గేటు పక్కన పండ్ల వ్యాపారం సాగిస్తూ జీవనం సాగిస్తున్నాను. అర్థాంతరంగా గేటు మూసివేతతో ఇబ్బంది నెలకొంది. పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జీ నిర్మించాలి.
- వనం నరేందర్,
పండ్ల వ్యాపారి