Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.20 పెంచి అమ్ముతున్న వైనం
- పట్టించుకోని ఎక్సైజ్ శాఖ పోలీసులు
నవతెలంగాణ-గణపురం
చెల్పూర్ మద్యం షాపుల్లో మద్యం ప్రియులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎమ్మార్పీ రేటుకు మించి మద్యం అమ్ముతూ వారి జేబులు గుళ్ల చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ 'ఏం చేస్తారో చేసుకోండి' అంటూ దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. ఎక్సైజ్ శాఖ, పోలీస్ అధికారులు మామూళ్ల మత్తులో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా మద్యం షాపు యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మరో 20 రోజుల్లో కొత్త షాపులు వస్తుం డడంతో అందినంత దోచుకునేందుకు బ్రాండి షాప్ యజమానులు యత్నించడం గమనార్హం. గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో శివయ్య వైన్స్, గణేష్ వైన్స్ రెండు షాపులున్నాయి. ఈ రెండు సిండికేట్‌గా మారి నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒక్కో బాటిల్ మీద రూ.20 ఎక్కువ తీసుకొని విక్రయి స్తున్నట్టు పలువురు మద్యం బాబులు ఆరోపిస్తున్నారు. గణేష్ వైన్స్ నుంచి నేరుగా బెల్టు షాపులకు విక్రయిస్తున్నారు. శివయ్య వైన్స్ లో మాత్రమే మద్యం అమ్ముతున్న పరిస్థితి. యజమానులు ఎంత చెప్తే అంత రేటు పెట్టి మద్యం ప్రియులు కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మద్యం షాపులు సీజ్ చేయాలని పలువురు కోరుతున్నారు.
పల్లెల్లో 'బెల్ట్' విచ్చలవిడి
నవతెలంగాణ-లింగాలఘణపురం
జనగామ జిల్లావ్యాప్తంగా బెల్ట్ రూపంలో మద్యం ఏరులై పారు తోంది. జిల్లాలో 12 మండలాల్లో మొత్తం 43 లైసెన్స్డ్ మద్యం దుకాణాలు కోనసాగు తున్నాయి. వీటిలో 7 మాత్రం జిల్లా కేంద్రంలో ఉన్నా యి. మిగతా 33మద్యం షాపులు గ్రామాల్లో నడుస్తున్నాయి. బెల్ట్ షాపులను లైసెన్స్డ్ మద్యం దుకాణాల నిర్వాహకులే ప్రోత్సహిస్తున్నారు. జిల్లా లోని గ్రామాల్లో సుమారు రెండు వేలకు పైగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నట్లు సమాచారం. బెల్ట్ షాపులకు ఒక్కో క్వార్టర్ బాటిల్ కు వైన్ షాపు వారు రూ.15 అదనంగా విక్రయిస్తున్నారు. బెల్ట్షాపువారు రూ.30 అద నంగా కలిపి విక్రయిస్తున్నారు. బీరుకు రూ.15-20 వరకు అదనంగా వసూలు చేయడం గమ నార్హం. ఈ లెక్కన క్వార్టర్ బాటిల్ పై రూ.40 అదనంగా వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడు తున్నారు. బెల్ట్ షాపులో విక్రయించే మద్యం బాటిళ్ల పై ప్రైవేటు స్టిక్కర్లు అతికించి మద్యం అమ్ముతున్నారు. అధక లాభాల కోసం ఆశపడి బెల్ట్ షాపు నిర్వహకులు మరో మండలం మద్యం కొనుగోలు చేయకుండా దాడులు నిర్వహించి బల వంతంగా స్టిక్కర్లు లేని మద్యం బాటిళ్లు సీజ్ చేయడం గమనార్హం.
బెల్ట్‌షాపు నియంత్రణకు చర్యలు
బెల్ట్ షాపుల నిర్వహణపై నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం గ్రామాల్లో దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటాం .
- సీఐ నాగేశ్వరరావు