Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జాప్యంపై కిందిస్థాయి అధికా రుల పట్ల జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని సముద్రాల, విశ్వనాథపూర్, థానేదార్పల్లి గ్రామాల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చారు. తనిఖీల నేపథ్యంలో సముద్రాల గ్రామంలో స్థానికంగా గ్రామ ప్రత్యేకాధికారి, సంబంధిత అధికారులు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని ఆరు గ్రామాలకు గానూ, స్థానిక ఎంపీడీఓ కుమారస్వామి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సముద్రాల గ్రామంలో సంబంధిత అధికారులు మండల ప్రత్యేకాధికారి నర్సయ్య, గ్రామ ప్రత్యేకాధికారి, ఐబీ ఏఈ యాసర్, పంచాయితీ కార్యదర్శి సంతోష్, క్షేత్రస్థాయిలో లేరు. దీంతో ఎంపీడీఓపై ''నిన్ను సరిచేస్తే సరిపోతుంది'' అని ఆగ్రహిస్తూ డీపీఓకు ఫోన్ కాల్ ద్వారా మెమో జారీ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్నం కావస్తున్నా అధికారులు విధుల్లోకి రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. గ్రామంలో ఇన్చార్జీ పంచాయతీ కార్యదర్శి ఉండడమెంటనీ, ఎంపీఓ కు పీఏ గా పంచాయితీ కార్యదర్శిని పంపడమేంటని అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు విధులు నిర్వర్తిస్తున్నారా లేదా అని ఎంపీడీఓను నిలదీ శారు. అనంతరం విశ్వనాథపురం గ్రామానికి వెళ్లగా పంచా యతీ కార్యదర్శి సరైన వివరాలు తెలపకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. తానేథార్పల్లిలో ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శిని వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్3 లోపు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని, 18 ఏండ్లు నిండిన వారి వివరాలు సేకరించాలన్నారు. ఊర్లో లేకుంటే ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుని, వ్యాక్సిన్ అందించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. తహసీల్ధార్ విశ్వ ప్రసాద్, డీఎంహెచ్ఓ మహేందర్, మండల ప్రత్యేక అధికారి నర్సయ్య పాల్గొన్నారు.