Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ధర్మసాగర్
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ హనుమకొండ జిల్లా కమిటీ సభ్యుడు గట్టు మల్లయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల కార్యదర్శి మర్రిపల్లి అంకుష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్ల పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని ఆవేదనను వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రజల సొమ్మును వారికి దోచి పెడుతోందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితులకు 3ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని బూటకపు హామీలను ఇచ్చి ఏడేండ్ల కాలంలో వారికీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పోరాటాలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చిలక బాబు, కొట్టే ప్రభాకర్, కర్ర రాజిరెడ్డి, బండి రత్తమ్మ, చిలుక బాబు, తదితరులు పాల్గొన్నారు.