Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
హుజరాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ను గెలిపించాల్సిన బాధ్యత బడుగు, బలహీనవర్గాలదేనని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాలరావు పిలుపునిచ్చారు. శుక్రవారం బాలసముద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభ పెడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తొందన్నారు. దొరల అహంకారానికి గురైన బడుగు, బలహీన వర్గాల నేత ఈటలకు జనాభాలో 90శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మద్దతు ఇవ్వాలన్నారు. ఈ పోరు గెల్లు, ఈటలకు మధ్య కాదని, కేసీఆర్, ఈటల మధ్య పొరుగానే చూడాలలన్నారు. ప్రజలు పార్టీలు, జెండాలకు అతీతంగా ఈటలకు మద్దతు ఇవ్వాలని కోరారు.
బీసీ జేఏసీ నాయకుడు.. తిరుణహరి శేషు మాట్లాడుతూ.. గతంలో జరిగిన తెలంగాణ, బీసీ ఉద్యమాలకు ఈటల మద్దతుగా నిలిచారు. ఈటలపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు లేకపోయినా మంత్రివర్గ నుంచి బర్తరఫ్ చేశారన్నారు. బీసీలకు ఏమి చేశారని టీఆర్ఎస్కు ఓటేయాలని ప్రశ్నించారు. బీసీ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంజన్ రావు మాట్లాడుతూ.. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంను 4 లక్షల కోట్ల అప్పుల్లో సీఎం కేసీఆర్ ముంచారని విమర్శించారు. క్యాబినెట్లో 9 మందికి బదులు. నలుగురు బీసీలకే అవకాశం ఇచ్చాడని, ఇటీవల ఈటలను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్. కష్ణయ్య బీసీ ఉద్యమ ద్రోహని, బీసీల కోసం కొట్లాడుతనాని ప్యాకేజీలు మాట్లాడుకున్నాడని ఆరోపించారు. మొన్నటిదాక కేసీఆర్‌ను విమర్శించి, ఇప్పుడు టీఆర్ఎస్కు ఓటేయమని చెప్పడంలోని అంతర్యమేమిటనీ ప్రశ్నించారు. అన్ని వర్గాలకు ప్రజలు ఈటలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు సాయిని నరేందర్, కామాగొని రాజు, ముంజ వెంకటేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.