Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని అధికారులు
- ఇబ్బందులు పడుతున్న సిబ్బంది
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వరంగల్ మహానగర పాలక సంస్థలో తాగునీటి కోసం సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వందల మంది ఉద్యోగులు గ్రేటర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడికి వేలాదిమంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తూ పోతుంటారు. కానీ సిబ్బందికి, బల్దియాకు సమస్యల పరిష్కారం కోసం వచ్చి పోయే వారికి తాగడానికి నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక తాగునీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది. తాగునీరు కొనుక్కోవాల్సిన పరిస్థితి రావడంతో తమ జీతాలే తక్కువ పై పెచ్చు తాగునీరు కొనుక్కోవాల్సి రావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ విషయాన్ని మేయర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆమె స్పందించి సంబంధిత అధికారులను పిలిచి బల్దియాలో తాగునీరు అందించాలని నాలుగు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేశారు. కానీ మేయర్ ఆదేశాలు అమల్లోకి రాలేదని, మేయర్ చెప్పిన తాగునీటి సమస్య తీరలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా భోజనం చేయడానికి ఏ ఫ్లోర్ లో విధులు నిర్వర్తిస్తున్న పురుషులు, మహిళలకు భోజనం చేయడానికి వేరు, వేరు గదులు కేటాయించాలని పలువురు ఉద్యోగులు కోరుతునానరు. వెంటనే మేయర్, కమిషనర్ స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు, బల్దియాకు వచ్చేవారూ కోరుకుంటున్నారు.