Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ సభత్వ నమోదుకు అపూర్వ ఆదరణ
నవతెలంగాణ-నర్సంపేట
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ నిరంతర పోరాటాలను చేపడుతుందని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు జూనియర్ కళాశాలల్లో ఒక్క రోజు ఎస్ఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టగా, విద్యార్థులు అపూర్వంగా ఆదరించారు. ఈ సందర్భంగ ప్రశాంత్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. 1970 కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో కేవలం తొమ్మిది మందితో ఆవిర్భవించిన ఎస్ఎఫ్ఐ 50 వసంతాలను పూర్తి చేసుకొందన్నారు. అధ్యయనం, పోరాటం ప్రధాన నినాదంతో ఎస్ఎఫ్ఐ నిరంతరమూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటంలో ఎంతో మంది విద్యార్థి నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులయ్యారని తెలిపారు. సుదీర్ఘ పోరాటాలతో విద్యార్థుల పక్షాణ పోరాడి పరిష్కారం చూపిన చరిత్ర ఎస్ఎఫ్ఐ జెండాకు ఉందన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిఫ్ కోసం, ప్రభుత్వ విద్యా రంగాలను ప్రయివేటు పరం కాకుండా పోరాటాలు చేసి విజయం సాధించిపెట్టిందని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రయివేటు, కార్పొరేటీకరణ, కాషాయికరణ విధా నాలను వ్యతిరేకించడానికి మరిన్ని పోరాటాలను చేపట్టి అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఎస్ఎఫ్ఐ చేపట్టనున్న ఉద్యమాలలో పాలు పంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రాకేష్, ప్రశాంత్, సురేష్ శ్రీకాంత్, రాజు, రహీం, కష్ణ తదితరులు పాల్గొన్నారు.