Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి
నవతెలంగాణ-భీమదేవరపల్లి
హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హనుమకొండ ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి హెచ్చరించారు. ముల్కనూర్‌లోని హౌటల్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను శుక్రవారం ఆయన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హౌటళ్లలో కలర్స్‌తో కూడిన బిర్యాని అమ్మకూడదన్నారు. బేకరీ యాజమానులు తప్పనిసరిగా లైసెన్స్‌లు కలిగి ఉండాలన్నారు. రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లలో తినుబండారాలను కవర్లతో కప్పి ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సదానందం తదితరులు పాల్గొన్నారు.