Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-హసన్‌పర్తి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ సంపదను కొల్లగొట్టి తన అనుచరులైన పెట్టుబడిదారులకు దోచిపెడుతోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండల కేంద్రంలోని శుభమస్తు గార్డెన్స్‌లో హసన్‌పర్తి మండల సీపీఐ(ఎం) 6వ మహాసభ శుక్రవారం సురెందర్, పెండ్యాల రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నదని ఆరోపించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే ప్రభుత్వాలు రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వ్యవసాయరంగాన్ని దెబ్బతీసున్నాయన్నారు. సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం చుక్కయ్య, రాగుల రమేష్‌లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు రోజురోజుకు పెంచుతూ ప్రజలపై అదనపు భారం మోపుతుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాబోయే కాలంలో ప్రజాసమస్యలపై కార్యకర్తలంతా పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నూతన మండల కమిటీనీ 9 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా గుమ్మడిరాజుల రాములు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లా అశోక్, రజిత, సతీష్, రాజు, పద్మ, కుమార్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.