Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్య, ఆరోగ్యం కీలకం : ఎస్పీ కోటిరెడ్డి
- మెగా వైద్యశిబిరం విజయవంతం
నవతెలంగాణ-కొత్తగూడ/గంగారం
ప్రజలకు పోలీసు శాఖ అండగా ఉంటుందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. ప్రజలకు విద్య, ఆరోగ్యం కీలకమని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ అమరవీరుల స్మారకంగా గంగారం మండలంలోని కోమట్లగూడెం గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరాన్ని ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత ఎస్పీకి గ్రామస్తులు పూర్ణకుంభంతో వేదమంత్రోచ్ఛారణల నడుమ ఘనస్వాగతం పలికారు. వైద్య శిబిరంలో సుమారు వెయ్యి మందికిపైగా ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కంటి, దంత, గైనకాలనీజ, జనరల్ ఫిజీషియన్, తదితర రంగాల వైద్యనిపుణులు ప్రజలను పరీక్షించి మందులు అందించారు. శిబిరానికి హాజరైన పరిసర ప్రాంతాల ప్రజల కోసం పోలీసులు భోజన, రవాణా, ఇతర ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడారు. ప్రజలు విద్యకు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంత యువత మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్యసేవలు అందించేందుకే శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. త్వరలో అర్హులకు కానిస్టేబుల్ శిక్షణ అందిస్తామన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. సమస్యలు ఏవైనా ఉంటే పోలీసుల సహకారం తీసుకోవాలని చెప్పారు. అనంతరం ఎస్పీ వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.కార్యక్రమంలో డీఎస్పీ సదయ్య, గూడూరు సీఐ రాజిరెడ్డి, ఎస్సై చంద్రమోహన్, కొత్తగూడ, గంగారం జెడ్పీటీసీలు పులుసం పుష్పలత, ఈసం రమ, గంగారం ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు, మహబూబాబాద్ సీఐ రవికుమార్, ఎస్సైలు సతీష్, సురేష్, అరుణ్‌కుమార్, ఐఎంఏ మహబూబాబాద్ అధ్యక్షుడు డాక్టర్ బాలునాయక్, ఐఎంఏ నర్సంపేట అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, గంగారం పీహెచ్సీ వైద్యుడు ముఖ్రం, కోమట్లగూడెం పీహెచ్సీ వైద్యులు అఫ్రోజ్, సాయినాథ్, వైస్ ఎంపీపీ ముడిగ వీరభద్ర, సర్పంచ్ గొగ్గెల సుగుణ లక్ష్మయ్య, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు ఇర్ప సూరయ్య, తదితరులు పాల్గొన్నారు.