Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
భవన నిర్మాణ కార్మికులు ఐక్యంగా హక్కుల సాధన కోసం పోరాడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్‌రావు కోరారు. మండల కేంద్రంలోని గోవిందరెడ్డి షాప్ సమీపంలో లేబర్ అడ్డ ఏర్పాటు చేసిన సందర్భంగా సోమవారం నిర్వహించిన సభకు నవీన్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుతారి మేస్త్రీ, సెంట్రింగ్, పెయింటింగ్, తదితర కార్మికులకు అందుబాటులో ఉండేలా అడ్డా ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. భవన నిర్మాణ కార్మిక సంఘానికి సీఐటీయూ అండగా నిలుస్తున్న క్రమంలో కార్మికులు సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. కార్మికులకు లేబర్ కార్డులు జారీ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు సింధూర రవి నాయక్, మాజీ ఓడీసీఎంఎస్ చైర్మెన్ మహేందర్‌రెడ్డి, తొర్రూరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుమతి, ఎస్సై ప్రవీణ్, సీఐటీయూ జిల్లా నాయకుడు దుండి వీరన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, మండల అధ్యక్షుడు కొండ ఉప్పలయ్య, కార్యదర్శి కాయిత రాంబాబు, కోశాధికారి మల్సూర్, ఉపాధ్యక్షులు ధరావత్ వెంకన్న, ఎడెల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు పసుపులేటి యాదగిరి, మట్టె మురళీ, ఆలేటి నాగయ్య, ముత్తయ్య, జినక సైదులు, గోపి రమేష్, తదితరులు పాల్గొన్నారు.