Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపురం
మండలంలోని బోదాపురం గోదావరి లంకల్లో ఆదివాసీలు సాగు చేస్తున్న పుచ్చతోటను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెట్ వాసం నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో సోమవారం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 40 ఏండ్లుగా గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లో ఈ ఏడాది పుచ్చ మొక్కలు నాటగా వాటిని ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయమై ఎస్సై తిరుపతికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఆదివాసీ రైతుల పుచ్చ తోటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు గిరిజనేతరులను వారి భూముల్లో నుంచి వెళ్లగొట్టే వరకు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆదివాసీ రైతులు పొడెం సత్యం, తెల్లం సుజాత, పొడెం కాంత, పొడెం లక్ష్మీకాంత, సపక నాగమ్మ చందర్రావు, తదితరులు పాల్గొన్నారు.