Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
అర్హులందరూ కోవిడ్ రెండు విడతల టీకాలు వేసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య కోరారు. జిల్లా కేంద్రంలోని ముస్లిమ్ వాడలో 15 రోజులుగా కొందరు టీకా వేసుకోడానికి నిరాకరిస్తున్నారని వైద్య సిబ్బంది డీఎంహెచ్ఓ దష్టికి తీసుకెళ్లగా సోమవారం నిర్వ హించిన టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆదేశించడంతో డీఎం హెచ్ఓ స్పందించారు. సర్పంచ్ బండారి నిర్మల హరినాధం, ఎంపీడీఓ శ్రీను, ముస్లిమ్ పెద్ద సలీమ్లతో కలిసి వెంటనే ముస్లిమ్ వాడలో రాయినిగూడెం పీహెచ్సీ సిబ్బందితో కలిసి ఇంటింటికీ టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది నర్సమ్మ, ఆశా వర్కర్లు నీల, రజియా బేగం, యశోద తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల కేంద్రంలోని పీహెచ్సీ వైద్యుడు సుకుమార్, సిబ్బందితో కలిసి గోవిందరావుపేట, మచ్చాపూర్ గ్రామాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టగా డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య పర్యవేక్షించారు. ప్రజలకు అవగాహన కల్పించారు.