Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
మండలంలో కాంగ్రెస్ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఖాన్ కోరారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ జెండా పండగ కోసం గద్దెల నిర్మాణ విషయమై మండల కేంద్రంలోని రామాలయ కమ్యూనిటీ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్యనాయకుల సమావేశానికి వెంకన్న, అయూబ్ ఖాన్ ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజాపోరాటాలు నిర్మించాలని సూచించారు. అన్ని గ్రామాల్లోనూ జన జాగరణ పాదయాత్ర చేపట్టాలని చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ జెండా పండుగను కన్నుల పండువలా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈనెల 15 వరకల్లా అన్ని గ్రామాల్లోనూ జెండా గద్దెల నిర్మాణం చేపట్టాలన్నారు. పార్టీ బలోపేతం కోసం ఐక్యంగా పని చేయాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత పాలన సాగిస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడచినా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. ఎస్సీ కాలనీలో చేపట్టిన 51 ఇండ్లు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ నుంచి తహసీల్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్ సెంటర్లో ఒకరోజు నిరాహార దీక్ష చేపడతామన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, వరి వేయొద్దన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళనలు చేపడతామని చెప్పారు. వరి పంట విషయమై సీఎం కేసీఆర్ పునరాలోచించాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకుడు మహ్మద్ ఖలీల్ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, నాయకులు సోదా రామయ్య, గుడ్ల దేవేందర్, యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ మహ్మద్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చేల వినరు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కర్నె సత్యం, నాయకులు మద్దుకురి కోటేశ్వరరావు, గద్దల నవీన్, ఈసం జనార్ధన్, కిరణ్కుమార్, సప్పిడి రాము, సర్దార్, సదనపల్లి లక్ష్మయ్య, యాలం వెంకటనారాయణ, తోట ప్రశాంత్, బొల్లే మహేందర్, కంభం రాజేష్, ప్రకాష్, బత్తుల సంపత్, సోషయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు పస్తం లక్ష్మయ్య, పడిదల సారయ్య, రియాజ్ జియా, ముస్తఫా, సారికొప్పుల శ్రీనివాస్, పడిదల హన్మంతు, తదితరులు పాల్గొన్నారు.