Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండల కేంద్రంలో మరో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు కందునూరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యలంఓ స్థానిక నెహ్రూ సెంటర్లో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న ఆధార్ కేంద్రంలో రద్దీ పెరుగుతోందని చెప్పారు. ఈ-శ్రమ్ భీమా, పింఛన్, తదితరాల కోసం ప్రజలు ఆధార్ సెంటర్ చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్లో సాంకేతిక లోపం కారణంగా వివిధ రకాల దవీకరణ పత్రాలు పొందటానికి విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తక్షణమే రెవెన్యూ అధికారులు అదనపు కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని, అధార్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోలో జిల్లా, మండల నాయకులు కవిత, రాజారావు, ఈశ్వర్లింగం, వెంకటేశ్వర్లు, గోవింద్, ఎల్లయ్య, సత్యవతి, రమ, నాగమణి, హరి, లోకేశ్వర్రావు, మౌనిక, రామకృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.