Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్డీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, ర్యాలీ
నవతెలంగాణ-బయ్యారం
మనిషిని మనిషి దోచుకోబడని సమాజం కోసం వీరులు అమరత్వం పొందారని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య తెలిపారు. మండలంలో సోమవారం నిర్వహించిన అమరవీరుల సంస్మరణ వారోత్సవాలకు తుడుం వీరభద్రం అధ్యక్షత వహించగా తొలుత గడ్డం వెంకట్రామయ్య విజ్ఞాన కేంద్రం భవనంపై దొరన్న కుమారుడు వైజేష్, తుడుం రామయ్య స్తూపంపై అయన సతీమణి వెంకటమ్మ, తెలంగాణ అమరవీరుల స్తూపం, కాచనపల్లి స్తూపంపై కొదుమూరి వీరభద్రం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌని ఐలయ్య మాట్లాడారు. భూమికోసం, భుక్తికోసం అనేక మంది పోరాడి అమరత్వం పొందారని తెలిపారు. పాలకులు కార్పొరేట్, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ దేశ ప్రజలను దోచుకునేలా అనుమతిస్తున్నారని విమర్శించారు. పేదలు మరింత పేదరికంలో మగ్గిపోతుండగా ధనికులు మరింత సంపన్నులౌతున్నారని చెప్పారు. వ్యవస్థ మార్పు కోసం జరుగుతున్న ఉద్యమాల్లో అన్ని తరగతుల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఊకే పద్మ, మదార్, మాదంశెట్టి నాగేశ్వర్రావు, ఏపూరి వీరభద్రం, తిరుమలేష్, మధు, తుడుం అనురాధ, రేణుక, ప్రభాకర్, మునీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీ రాయల వర్గం ఆధ్వర్యంలో..
భారత విప్లవోద్యమ అమరులను స్మరిస్తూ మండలంలోని తెలంగాణ అమరవీరుల స్తూపంపై యాకయ్య, కాంచనపల్లి అమరవీరుల స్తూపంపై సూర్యం జెండాలు ఎగరేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ డివిజన్ కార్యదర్శి జగ్గన్న, మండల కార్యదర్శి సూర్యం మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, దేశ ప్రజల విముక్తి లక్ష్యంగా దేశంలో అనేక విప్లవ పోరాటాలు ముందుకొచ్చాయని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాల్లో అనేక మంది అమరులయ్యారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సత్యం, యాకయ్య, మధుసూదన్‌రావు, భద్రయ్య, వెంకన్న, అప్పయ్య, చంద్రయ్య, అశోక్, కళింగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయం ఎదుట పార్టీ సబ్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అధ్యక్షతన అమరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి రవి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కొత్త వెంకట్‌రెడ్డి, యాకూబ్ పాషా, భీమా, అక్షర, చరణ్, వెంకన్న, ప్రసాద్, నారాయణ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.