Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతు సంఘం నాయకులు గుండె రవి గౌడ్
నవతెలంగాణ-ములుగు
వరి పంట సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు ఎత్తివేయాలని రైతు సంఘం నాయకులు గుండెబోయిన రవిగౌడ్, బిక్కినేని కొండల్రావు డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆద్వర్యంలో మండలంలోని సర్వాపూర్లో రైతులు సోమవారం వరి గడ్డితో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవి, కొండల్రావు మాట్లాడారు. లక్నవరం, రామప్ప, తదితర చెరువుల కింద రైతులు వరి పండించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఏ భూమిలో ఏ పంట వేయాలో రైతులకు తెలుసని, ప్రభుత్వాలు ఆంక్షలు విధిం చడం సరికాదని స్పష్టం చేశారు. మంత్రులు, కలెక్టర్లు సైతం వరి సాగు చేయొద్దని, విత్తనాలు విక్రయిస్తే షాపుల యజ మానులపై కేసులు పెడతామని ప్రకటించడం దుర్మార్గ మన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి కాళే శ్వరం ప్రాజెక్టు నిర్మించి వరి పండించొద్దనడం హాస్యస్పదం గా ఉందన్నారు. కేరళ ప్రభుత్వ తరహాలో రాష్ట్రంలోనూ రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతులు గైకాడి కొండయ్య, భూక్య దాసు, తిమ్మాపురం సాంబయ్య, భూక్య సమ్మయ్య, దనోరి శ్రీనివాస్, సల్లూరి వెంకట్ నర్సు, అపాచీ సన్నీ, బాగె సాంబమూర్తి, నరేష్ భూక్య, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.-