Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాస్తారోకో, ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
నవతెలంగాణ-ములుగు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేయడం వల్లే నిరుద్యోగి మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ అన్నారు. బీజేవైఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం రాస్తారోకో నిర్వ హించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భం గా సురేందర్ మాట్లాడారు. టీఆర్ఎస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మించిన క్రమంలోనే ఎన్నికల్లో యువత ఓటేసి గెలిపించినా అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీని విస్మ రించి మోసపూరిత పాలన సాగిస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మంచిర్యాలలో దళిత సామాజికవర్గా నికి చెందిన మహేష్ ఆత్మహత్యకు రాష్ట్ర ప్రభుత్వమే కారణ మన్నారు. నిరుద్యోగ యువతకు ఆత్మహత్య చేసుకోవద్దని, ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం పోరాడుతామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, తదితరా లను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన క్రమంలో అమలు దిశగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని, మహేష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కృష్ణాకర్‌రావు, బీజేపీ మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్, యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతిరెడ్డి రాకేష్‌రెడ్డి, జిల్లా నాయ కుడు రాయంచు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాని కొమ్ము హరీష్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అజ్మీరా కిషోర్ నాయక్, జినుకల శ్రావణ్, జిల్లా కార్యదర్శి జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : బస్టాండ్ సెంటర్లో బీజేవైఎం అర్బన్ అధ్యక్షుడు కాగు నవీన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమం లో బీజేపీ జిల్లా కార్యదర్శి పరుపాటి రామ్మోహన్‌రెడ్డి, పాండవుల యాకంబరం, బీజేవైఎం నాయకులు నూకల నవీన్, బోనగిరి శివసాయి, కొండ రాజు, బొల్లు ప్రవీణ్, మచ్చ ఉదరు, కల్యాణ్, మహ్మద్ అమీర్ పాల్గొన్నారు.