Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘణపురం
నిరుద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయనందుకు స్టేషన్‌ఘన్‌పూర్ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసి డెంట్ బస్వాగని అనిల్‌గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను మండల కేంద్రంలో సోమవారం దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బేరా చెలుక గ్రామానికి చెందిన ఆశమ్పల్లి మహేష్ ఉద్యగం రావడం లేదని, ఉద్యోగలి నోటిఫికేషన్ రాదేమోనని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానుక శివరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివ కుమార్, ఎంపీటీసీలు కేమిడి భిక్షపతి, బర్ల కుమార్ మాధవి, రజితఉపేందర్, నీలం మోహన్, రామ లింగం, సాదానందం, నాయకులు పాల్గొన్నారు .