Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐఎన్టీయూసీ నాయకులు జోగ బుచ్చయ్య
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
భూపాలపల్లి ఏరియాలో అన్ని బావుల వద్ద కోతుల బెడద ఎక్కువగా ఉన్నదని, కార్మికుల వాహన షెడ్లకు ఐరన్ మెస్‌లు ఏర్పాటు చేయాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్(ఐఎన్టీయూసీ) భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య డిమాండ్ చేశారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోతుల బెడదతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బైక్‌ల రక్షణకు షెడ్ చుట్టూ ఐరన్ మెస్‌లు అమర్చేందుకు యజామాన్యం చర్యలు తీసు కోవాలన్నారు. పలుమార్లు కార్మికులపై దాడి చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయన్నారు. కార్మికుల భోజన ప్రాంతం ఏర్పాటుతోపాటు చుట్టూ ఇనుప జాలి ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు పసునూటి రాజేందర్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అండెం రఘుపతిరెడ్డి, బ్రాంచి సెక్రటరీలు బి మధుకర్‌రెడ్డి, బి రాములు, శంకర్, సంధి జనార్దన్, ఎస్ శ్రీనివాస్, బాలునాయక్, తదితరులు పాల్గొన్నారు.