Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అధికారులను ఉపాధి కూలీల నిలదీత
నవతెలంగాణ-మల్హర్రావు
ఉపాధి హామీలో భాగంగా కూలి పనులకు వెళ్లడానికి జాబ్ కార్డులను ఇప్పించాలని ఏడాదిగా దరఖాస్తులు పెట్టు కున్నా మండల పరిషత్ కార్యాలయం, అధికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించు కోవడం లేదు. దీంతో సోమవారం మండలంలోని పాత రుద్రారంలో నిర్వహించిన గ్రామసభలో ఉపాధి కూలీలు నిలదీశారు. గ్రామ సభకు సర్పంచ్ డుమ్మా కొట్టగా ఉపసర్పంచ్ బుడిగా వెంకటేష్ అధ్యక్షతన పంచా యతీ కార్యదర్శి శ్రీలక్ష్మీ గ్రామ సభ నిర్వహించారు. ఎంపీడీఓ నరసింహమూర్తి హాజరై మాట్లాడుతున్న క్రమంలో ఒకేసారి ఉపాధి కూలీలు లేచి అధికారులపై మండిపడ్డారు. పనిలేని నిరుపేద కూలీలకు పనులు కల్పించడానికి ఉపా ధిహామీని ప్రవేశపెడితే మండలంలోని ఉపాధిహామీ అధి కారులు తమకు పనులు కల్పించకుండా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న వందమంది కూలీలకు జాబ్ కార్డులు ఇప్పించాలని ఇప్పటికే ఏడాదిగా ఒక్కో కూలి ఐదుసార్లు దరఖాస్తులు చేసుకుంటే 20మందికి మాత్రమే జాబ్ కార్డులు మంజూరు చేసి 80 మంది కూలీలకు ఇవ్వలేదని వాపోయారు. జాబ్ కార్డులు ఇప్పించాలని ఉపాధి ఎపీఓ హరీష్, కంప్యూటర్ ఆపరేటర్ రాజ్‌కుమార్, కార్యదర్శి శ్రీలక్ష్మీ, స్థానిక పాలకులకు పదుల సార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఎంపీడీఓకు విన్న వించారు. గ్రామంలో మూడేండ్లుగా వితంతు, వృద్ధాప్య, వికలాంగులకు కొత్త ఆసరా పింఛన్ కూడా రావడం లేదని వాపోయారు. ఇందుకు ఎంపీడీఓ ఈ సారి దరఖాస్తులు పెట్టుకుంటే జాబ్ కార్డులు తప్పకుండా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చిగురు సదయ్య, బూర్ల రాజయ్య, ప్రజలు పాల్గొన్నారు.