Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పాఠశాలలకు పూర్తిగా
రాని పాఠ్యపుస్తకాలు
అ వెంటాడుతున్న ఉపాధ్యాయుల కొరత
నవతెలంగాణ-మల్హర్రావు
మండలవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు 70శాతం మాత్రమే వచ్చాయి. పూర్తిగా రాక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు తిరిగి తెరుచుకుని రెండు నెలలవుతున్నా ఇంతవరకు పూర్తిగా పుస్తకాలు రాలేదు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉపాద్యాయులు చెప్పే పాఠాలు వింటున్నారే తప్పా చదవలేని పరిస్థితి నెలకొంది. తాడిచెర్ల, మల్లారం, వల్లేంకుంట, రుద్రారం గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాలలు, దుబ్బపేటలోని కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలోని ఇంటర్మీడియట్ విద్యా ర్థులకు ఉపాధ్యాయుల సరిపడా లేకపోవడంతో బోధించేవారు కరువయ్యారు.
మండలంలో మొత్తం 34 ప్రభుత్వ పాఠశాలు ఉండగా అందులో 5 జిల్లా పరిషత్, 27 ప్రాథమిక, రెండు ప్రాథమికోన్నత, ఒక మోడల్, ఒక కాస్తూర్బా ఆశ్రమ పాఠశాలున్నాయి. ఇందులో మొత్తం 1547 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సఖ్య పెరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన విద్యాశాఖ అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. పాఠశాలలకు వచ్చే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు తప్పనిసరి కానీ రెండు నెలలు అవుతున్న ఇంత వరకు పూర్తిగా రాలేదు.
మండలంలోని 34 పాఠశాలల్లో 124 మంది ఉపాద్యాయులకుగాను 97మంది మాత్రమే ఉన్నారు. గతేడాది విద్యా సంవత్సరంలో ప్రభుత్వం తాత్కాలి కంగా 20మంది విద్యావాలంటీర్లను నియమించగా నేటికి ఒక్కరిని కూడా నియమించలేదు. దీంతో జిల్లా పరిషత్ పాఠశాలల్లో బోధనకు ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం గత సంవత్సరం ప్రారం భించారు. ఈ సంవత్సరం కూడా తరగతులు ప్రారంభ మయ్యాయి. కానీ అధ్యాపకులను మాత్రం ఇంకా నియమించలేదు. మొదటి సంవత్సరం విద్యార్థులు 44, రెండవ సంవత్సరం చదివే విద్యార్థులు 51, మొత్తం 122మంది ఉన్నారు. వీరికి ఏడుగురు అధ్యాపకులు ఉండాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే ఉన్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు లేకపోవడంతో చదువులు సాగేదెలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.