Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమ వారం పట్టణంలోని 30వ వార్డు (రెడ్డి కాలనీ)లో ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటన చేసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ 30వ వార్డులో మున్సిపల్ శానిటేషన్ గురించి తెలుసుకునేందుకు వచ్చినట్టు తెలిపారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పట్టణ ప్రగతి లో ఓపెన్ ప్లాట్స్ శుభ్రపరిచినట్టు తెలిపారు. మళ్ళీ చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. అలాంటి ప్లాట్ల యజమానికి నోటీసులు ఇచ్చి, జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. 30 ఫీట్ రోడ్డు వేయాలని తీర్మాణం చేశామని, కానీ ప్రజలు స్వచ్ఛందంగా 25 ఫీట్ రోడ్డు సరిపోతుందని చెప్పారన్నారు. కానీ రోడ్డు విస్తారంగా ఉంటే ప్రజల కు ఇబ్బంది ఉండదని, కాలనీవాసులు ఇందుకు సహకరించాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది కొరత ఉండటం వల్ల పనులు వాయిదా పడుతున్న నేపధ్యం లో అదనపు సిబ్బంది నియామకాలకు చర్యలు తీసు కుంటామన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ అభి వృద్ధికి నిధులు మంజూరుకు సీఎం కేసీఆర్కు విన్న వించామన్నారు. త్వరలోనే నిధులు కూడా మంజూర వుతాయన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ వెంకటరాణి సిద్ధూ, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కటకం జనార్ధన్, వార్డు కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు, జిల్లా మైనార్టీ నాయకులు, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జాగృతి జిల్లా నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.