Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కాంగ్రెస్ యూత్
జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో నిరుద్యోగల హత్యలన్ని ప్రభుత్వ హత్యలేనని భూపాలపల్లి యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు బంధం శ్రీకాంత్పాణి అన్నారు. సోమవారం భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం బండ శ్రీకాంత్ పాణి, కాంగ్రెస్ పార్టి అధికార ప్రతినిధి ఆజ్మీరా జంపయ్య మాట్లాడుతూ....చెన్నూరు నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి మహేష్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అన్నారు. విద్యార్థి అమరవీరుల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్ అహంకారంతో ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు. పన్నెండు వందల మంది విద్యార్థి అమరవీరులు త్యాగం చేస్తే ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే రాజభోగాలు అనుభవిస్తూ విద్యార్థి, నిరుద్యోగుల భవిష్యత్తును రోడ్డున పడేస్తున్నదన్నారు. నిరుద్యోగి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన కేసీఆర్కు భవిష్యత్తులో పుట్టగతులుండవన్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబు తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు తోట రంజిత్, మహేందర్, చరణ్, పద్వి, విజరు, సురేష్, రాకేష్, ప్రశాంత్, జితేందర్ భూమేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.