Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎస్పీ, దళిత, గిరిజన విద్యార్థి సంఘాల డిమాండ్
నవతెలంగాణ-కాటారం
చిన్నారిపై లైంగిక దాడి చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, దళిత, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఆరేండ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసిన సర్పంచ్ భర్త రాధారపు శంకర్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి రామిళ్ళ రాకేష్, అధ్యక్షులు రవికుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రజలను ఆదుకోవాల్సిన వ్యక్తి కంచే చేను మేసిన చందంగా లైంగిక దాడికి పాల్పడడం దారుణమన్నారు. అలాంటి వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో ధర్నా సందర్భంగా గారిపెళ్లికి మూడు వైపులా సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కాటారం ఏఎస్సై ఎం సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ధర్నా చేస్తున్న నాయకులు, విద్యార్థి సంఘాల నాయ కులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్య దర్శి కడారి విక్రమ్, రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి అజ్మీర శ్రీకాంత్ నాయక్, సంపత్, బొడ్డు రాజబాబు, రాజు నాయక్, రాకేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.