Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ జనగామ పట్టణ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, జిల్లా నాయకులు ఉడత రవి యాదవ్ పాల్గొని మాట్లాడారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న వారిని నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం సాగు చేయొద్దనడం సరికాదన్నారు. ఎప్పటిలాగే రైతులు వరి సాగు చేసేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం విత్తనాలు రైతు సహకార సంఘాల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కో ఆప్షన్ సంఘం మాజీ వైస్ ప్రెసిడెంట్ కట్ట కృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బక్క శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జనగామ పట్టణ అధ్యక్షులు మాజిద్, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్, మరిగడ ఉపసర్పంచ్ నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షుడు రామకృష్ణ గానుపహుడు గ్రామశాఖ అధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
రూ.5వేల కోట్లు కేటాయించాలి : కేజీకేఎస్