Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వెస్ట్ జోన్ డీసీపీ బి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. సీపీ ఆదేశా నుసారం పోలిస్, ట్రాస్క్ఫోర్స్, రెవెన్యూ సంయుక్తంగా 17 జట్లను ఏర్పాటు చేశామన్నారు. సోమవారం విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక బస్‌స్టేషన్ వద్ద తహసీల్దార్, ఎస్సైలు రమేష్‌నాయక్, శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించామన్నారు. బ్రాహ్మణపల్లికి చెందిన గొప్ప సాయి క్రిష్ణ, తమ్మడపల్లి(ఐ)కి చెందిన రడపాక రవిచందర్, హనుమకొండకు చెందిన ఆకుల సాయి రాహుల్‌ను పట్టుకుని వారి నుంచి 300 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, 7 ఓసీబీ పేపర్లు స్వాధీనం చేసుకోని రిమాండ్ పంపించినట్లు తెలిపారు. కేసు విషయమై మరింత విచారించగా, ఎండీ ఖాదర్, దుద్దుల రాజశేఖర్, సాయి తప్పించుకుని తిరుగు తున్నారని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలనడవడికపై దష్టి సారించాలని అన్నారు. వెస్ట్ జోన్ పరిధిలో మత్తుపదార్థాల నివారణకు గంజాయి సాగు,నిల్వ, రవాణా, ధూమపానం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏసీపీ, సీఐ, ఎస్సైలు, సిబ్బంది సమన్వయంతో గంజాయి రవాణాను పట్టుకున్నందుకు అభినందించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. గతేడాది పోల్చితే రోడ్డుప్రమాదాలు తగ్గాయన్నారు. ఏసీపీ రఘుచందర్, సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు రమేష్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.