Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ధర్మభిక్షం
నవతెలంగాణ-జనగామ
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యల్ని విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తోందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ధర్మ భిక్షం విమర్శించారు. సోమవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో కళాశాలల కమిటీ సమావేశం గణేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల్లో కనీస మౌలిక సదుపాయాల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉందని, జూనియర్ కళా శాలలో లెక్చరర్ లేకుండా భోదన నడుస్తున్నదని తెలిపారు. సన్నబియ్యం పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పాలిష్ బియ్యంతోనే సరిపెడుతున్నారని ఆరోపించారు. పెండింగ్ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రూ.3వేల300కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్నారు. కాకతీయ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ నియమించి యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నవ్య శ్రీ, సరిత, కార్తిక్, తదితరులు పాల్గొన్నారు.