Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్
నవతెలంగాణ-రాయపర్తి
యువత మత్తుకు బానిసలైతే భవిష్యత్ అంధకారం అవుతుందని వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్ అన్నారు. శుక్రవారం మండలంలో గంజాయి సేవిస్తున్న యువకులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తదుపరి తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ ఎదుట బైడోవర్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఉన్నత శిఖరాలను అధిరోహించి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత గంజాయి మత్తులో పడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారని వాపోయారు. మత్తుకు అలవాటు పడితే అనేక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడంతో ఉత్సాహంతో ఉరక లెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమైపోతున్నారన్నారు.దురలవాట్ల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే చేయిదాటే ప్రమాదం ఉందని సూచించారు. డ్రగ్ మాఫియాపై ప్రభుత్వాలు, పోలీస్‌శాఖ ఉక్కుపాదం మోపుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయి భూతం యువతను పట్టి పీడించడం బాధాకరమన్నారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత యువకులతో గంజాయి సేవించకుండా ప్రార్థన చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బండారి రాజు, కానిస్టేబుల్స్ సంపత్, బొట్ల రాజు, శ్రీనివాస్, రమేష్, మహేందర్, అన్వేష్, హర్షిత రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.