Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా
ప్రధాన కార్యదర్శి సీతక్క
నవతెలంగాణ-పర్వతగిరి
రానున్న ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మండలంలోని అన్నారం షరీఫ్‌లో శుక్రవారం ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలం భిస్తున్నాయని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నదన్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి, ఎంపీపీ విజయ రూపు సింగ్ పాల్గొన్నారు.