Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
రాష్ట్ర ప్రభు త్వం అర్హులందరికీ పాదర్శకంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి జి సక్రు డిమాండ్ చేశారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల జారీ కోసం విచారణ ప్రక్రియపై మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోడు సాగుదారుల సమస్యలపై అనేక ఏండ్లుగా ఉద్యమించిన ఫలితంగానే ప్రభుత్వం పోడు సాగు దారులకు పట్టాలివ్వడానికి సంకల్పించిందని చెప్పారు. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం స్థానికంగా ఆర్ఓఎఫ్ఆర్ కమిటీలను పంచాయతీ, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తేనే అర్హులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఏజెన్సీ నియమాలను పాటిస్తూ 1/70 చట్ట పరిధిలో అటవీ పోడు భూముల యాజమాన్య హక్కు చట్టం-2006 నిబంధనలకు లోబడి లోతట్టు గిరిజన గ్రామాల దాకా అర్హులందరికీ పట్టాలివ్వాలని అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.