Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేషన్ షాప్ ప్రారంభం
నవతెలంగాణ-తొర్రూరు
పేద కుటుంబాలన్నిటికీ ఆహార భద్రత కల్పించే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుంటున్నారని పెద్ద వంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి తెలిపారు. మండలం లోని చిన్నవంగర గ్రామంలో ఏర్పాటు చేసిన రేషన్ షాప్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఎల్బీ, బీసీ, కిష్టా తండా గ్రామ పంచాయతీలకు చెందిన 252 కుటుం బాలకు సదరు షాప్ ద్వారా ప్రతినెలా 88 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తారని తెలిపారు. పేద కుటుంబాలు బియ్యం పంపిణీని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ శేషాద్రి, గ్రామ రైతు కోఆర్డి నేటర్ పాకనాటి ఉపేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమి టీ అధ్యక్షుడు విజయపాల్‌రెడ్డి, నాయకులు జలగం శేఖర్, భానోత్ గోపాల్, జాటోత్ పూల్‌సింగ్, మాజీ సర్పంచ్ రెడ్యా, పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీను, రేషన్ డీలర్ల సంఘం అధ్య క్షుడు ముత్యం అంజయ్య, బీసీ తండా ఉపసర్పంచ్ ధరావత్ శ్రీను, బావోజీ తండా ఉపసర్పంచ్ కాండ్ధ్య, బొమ్మకల్ డీలర్ రమేష్, జాటోత్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.