Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
అమరుల ఆశయ సాధన కోసం ఉద్యమించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోవర్ధన్ కోరారు. అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని మండలంలోని కంబాలపల్లి గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కామ్రేడ్ సురేష్ స్తూపంపై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు గుజ్జు దేవేందర్ అధ్యక్షత వహించగా గోవర్ధన్ మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం అర్ధ వలస, అర్ధ భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ మారాలని సామ్రాజ్యవాద విష సంస్కతిని వ్యతిరేకిస్తూ అనేక మంది ఉద్యమించి ప్రాణాలర్పించారని చెప్పారు. అమరుల ఆశయాల సాధన కోసం పోరాడాలని సూచించారు. సభలో పార్టీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, జిల్లా నాయకులు మదార్, దేశెట్టి రామచంద్రయ్య, ఎస్కే బాబు, పార్టీ, ప్రజాసంఘాల నాయకులు చారి హరీష్, బోనగిరి మధు, లెంకల ఎల్లయ్య, సంద వెంకన్న, రఫీ, మాదారపు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.