Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
యువత చదువులతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సీఐ కరుణాకర్‌రావు, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ కోరారు. డివిజన్ కేంద్రంలోని యతిరాజారావు స్మారక చిల్డ్రన్స్ పార్కులో తెలంగాణ బేడ బుడగ జంగాల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు తూర్పాటి సాయి ముఖేష్, తూర్పాటి మెండిస్‌లతో కలిసి ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను శుక్రవారం వారు ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానం గా భావించి క్రీడా స్పూర్తితో ముందుకు సాగాలని చెప్పారు. క్రీడలు దేహదారుఢ్యాన్ని పెంచుతాయని తెలిపారు. స్నేహ పూరిత వాతావరణంలో క్రీడాపోటీల్లో నిర్వహించాలని చెప్పారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలుంటాయ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మించేందుకు కృషి చేస్తోందన్నారు. క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహం కోసం క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, టీఆర్ఎస్ యూత్ జిల్లా నాయ కులు ముద్దసాని సురేష్, నాయకులు మాడుగుల పూలమ్మ, కిన్నెర పాండు, రాయిశెట్టి వెంకన్న, యూత్ అధ్యక్షుడు బసనబోయిన మురళీ యాదవ్, ఉపేందర్ పాల్గొన్నారు.