Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
దశాబ్దాలుగా ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములన్నింటికీ హక్కు పత్రాలివ్వాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుడుందెబ్బ, ఆదివాసీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడారు. జీఓ నెంబర్ 102 ప్రకారం గ్రామాల్లో స్థానిక ఆదివాసీలతోనే కమిటీలు వేయాలని, ఆదివాసీ సంఘాల నాయకులను భాగస్వాములను చేయాలని కోరారు. సాగు చేసుకుంటున్న పోడు, రెవెన్యూ భూములకు సంబంధించి పట్టాలివ్వాలని చెప్పారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చిన 29 శాతంలో ఏజెన్సీ జీఓల ప్రకారం నూరు శాతం ఉద్యోగాలు, ఉపాధి స్థానిక ఆదివాసీలకే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వట్టం శ్రీను బాబు, మండల అధ్యక్షుడు బండ సమ్మయ్య, మండల కార్యదర్శి పెనక సతీష్, తుడుందెబ్బ నాయకులు వట్టం రాంచందర్, ఇర్ప నారాయణ, తుర్స నిలమయ్య, ఆదివాసీ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు పూనెం సందీప్, సువర్ణపాక రాజేష్, తదితరులు పాల్గొన్నారు.