Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బచ్చన్నపేట
మండల కేంద్రానికి చెందిన పురగిరి క్షత్రియ సంఘం నేత, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో పెరిక సంఘంలో జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అనాథలకు పండ్లు పంపిణీ చేశారు. సంఘ అధ్యక్షుడు, పరపతి సంఘం అధ్యక్షులు దాచేపల్లి నరసింహారావు, లెంకల కర్ణాకర్ పాల్గొని మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బోడకుంట్ల వెంకటేశ్వర్ లకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. సంఘ సభ్యులు కిషన్, మల్లేశం, హరినాథ్, వెంకటేశం, నవీన్, వెంకటేష్, ఆంజనేయులు, కర్ణాకర్ పాల్గొన్నారు.