Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి మున్సిపాలిటీలో పన్నులను 100శాతం వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుండి బడ్జెట్ వివరాలు, వివిధ టాక్సీల కలెక్షన్, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆయా సెక్షన్ల సిబ్బంది వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీకి వివిధ పన్నుల రూపంలో మూడు కోట్ల రూపాయలకు పైన బకాయిలు ఉన్నాయని, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కమర్షియల్, హౌస్, వాటర్ పన్నులు వసూలు చేయాలని అన్నారు. ముంద స్తుగా కొన్ని వార్డులను ఎంపిక చేసి పైలెట్ పద్ధతిలో చెత్త వేరు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వ్యాపారులతో ముందస్తు సమావేశం నిర్వహించి ఏడు రోజుల వ్యవధి తర్వాత 15 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ ని వాడితే అపరాధ రుసుములు వసూలు చేయాలన్నారు. ప్లాస్టిక్ వినియోగించే వారికి కూడా జరిమానా విధించా లన్నారు. డిసెంబర్ 31లోగా ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నారు. పట్టణంలో మిషన్ భగీరథ నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్న పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని మున్సి పల్ కమిషనర్‌ను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలు, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ తదితర నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. గ్రీన్ బడ్జెట్ ద్వారా పట్టణంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను పకడ్బం దీగా నిర్వహించాలన్నారు. మున్సిపాలిటీకి వచ్చే ప్రజల సమస్యల పట్ల మానవతా దక్పథంతో వ్యవహరించాలని అన్నారు. మున్సిపాలిటీ వాహనాలకు జీపీఎస్ సిస్టం అనుసంధానం చేయాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, మున్సిపల్ చైర్ పర్సన్ షెగ్గం వెంకటరాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ అధికారి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.