Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాముత్తారం
'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం లొట్టపీసు చట్టం' అని వ్యంగా మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవిందన్ బర్తరఫ్ చేయాలని, పార్టీ సభ్యత్వాన్ని రద్దుచేసి పార్టీ నుండి బహిష్కరించాలని దళిత ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొలం రాజేందర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆడివాసీలు, దళితులపై ఆర్థిక దోపిడీకి, హత్యలు, హత్యాచారాలు, దాడులు దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయ న్నారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమల్జేయాలన్నారు. ఎంపీ అరవింద్ బహిరంగంగా క్షమాపణ చెప్పకుంటే తగినబుద్ధి చెప్పక తప్పదని హెచ్చరించారు. దళిత సంఘం నాయకులు రాయం రమేష్ మాట్లాడుతూ... ఎంపీ అరవింద్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు పొలం సతీష్ మాట్లాడుతూ.. అరవింద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ, దళిత సంఘాల నాయకులు కిరణ్ కుమార్, చిన్న రాజేందర్, దేవరాజు, శేఖర్, నగేష్, కార్తిక్, మహేష్, శివశేకర్, బాపు, రాజేందర్, శాంతకుమార్, రవి పాల్గొన్నారు.