Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆశావహుల్లో ఉత్కంఠ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్లో తీవ్రంగా కసరత్తు జరుగుతోంది. ఆ పార్టీలో ఎమ్మెల్సీల పదవులపై పెద్ద సంఖ్యలో నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల పదవీ విరమణ పొందిన ఎమ్మెల్సీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరిద్దరూ మరోసారి అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో 'కడియం'కు ఛాన్స్ ఇచ్చే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో బీసీ నేత ఎంపిక విషయంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితోపాటు పలువురు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఉద్యమం ఆవిర్భావం నుంచి పని చేసిన పలువురు నేతల పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకట్రెండు రోజుల్లో టీఆర్ఎస్ ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులపై ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల పదవీ విరమణ పొందిన ఎమ్మెల్సీల్లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మండలి మాజీ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరిద్దరిలో 'కడియం'కు మరోమారు ఛాన్స్ దక్కే అవకాశాలు మెరుగయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఆశావహులు పెద్ద సంఖ్యలో పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు పదవులు దక్కని నేతలున్నారు. వీరంతా ఈసారైన తమకు అవకాశం దక్కుతుందని నిరీక్షిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు ఎమ్మెల్సీ పదవులను దక్కించుకోవడం పార్టీలో విమర్శలకు తావిచ్చింది. హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాల నేపథ్యంలోనైనా ఉద్యమకారులకు గుర్తింపు వస్తుందా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 'కడియం'తోపాటు మరో నేతకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఉద్యమ నేతలకా ? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికా? అన్న విషయం తేలాల్సి ఉంది.
'క్యూ'లో నేతలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ పదవుల కోసం నేతలు 'క్యూ'లో ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, గుడిమల్ల రవికుమార్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 'కడియం', 'బోడకుంటి' రెండుసార్లు ఎమ్మెల్సీలుగా ఎంపికై ఇటీవల పదవీ విరమణ పొందారు. ఈ ఇద్దరు మరోమారు ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో నాటి నుంచి సముచిత స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీ పదవి కోసం 'సిరికొండ' తీవ్రంగా ప్రయత్నిస్తుండడమే కాకుండా పట్టుపడుతున్నట్లు తెలిసింది. మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌కు గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వని విషయం విదితమే. ఈ క్రమంలో సీతారాం నాయక్‌కు సీఎం ఎమ్మెల్సీ పదవి విషయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. వీరందరి కంటే ముందుగా వరంగల్ ఎంపీ ఉపఎన్నికల్లో ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్‌కు పార్టీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషయంలో పక్కనపెట్టారు. ఈ క్రమంలో సీఎం 'గుడిమల్ల' ఇంటికి స్వయంగా వచ్చి సముచితస్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీ పదవిపై 'గుడిమల్ల' ఆశలు పెట్టుకున్నారు. ఇదే క్రమంలో ఉభయ వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా గతంలో పని చేసిన తక్కళ్లపల్లి రవీందర్రావు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ పదవులపై ఉమ్మడి వరంగల్‌లో ఆశావహులు అధికంగా ఉన్నారు.
ఉద్యమ నేతలకు దక్కేనా..?
ఎమ్మెల్సీ పదవులు ఈసారైనా ఉద్యమ నేతలకు దక్కేనా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం టీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చినట్టయ్యింది. ఈ క్రమంలోనైనా సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు అవకాశం కల్పిస్తారేమోనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇవ్వడం పట్ల పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాడి కౌశిక్‌రెడ్డి పార్టీలో చేరగానే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం పట్ల కూడా నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. నేతలు ఎవరూ బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేయకపోయినా, అంతర్గతంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 'కడియం'తోపాటు మరో నేతకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఉద్యమ నేతలకా ? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికా? అన్న విషయం తేలాల్సి ఉంది.
'క్యూ'లో నేతలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ పదవుల కోసం నేతలు 'క్యూ'లో ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితోపాటు బోడకుంటి వెంకటే శ్వర్లు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, గుడిమల్ల రవికుమార్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు 'కడియం', 'బోడ కుంటి' రెండుసార్లు ఎమ్మెల్సీలుగా ఎంపికై ఇటీవల పదవీ విరమణ పొందారు. ఈ ఇద్దరు మరోమారు ఎమ్మెల్సీ పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలో నాటి నుంచి సముచిత స్థానం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీ పదవి కోసం 'సిరికొండ' తీవ్రంగా ప్రయత్నిస్తుండడమే కాకుండా పట్టుపడుతున్నట్లు తెలిసింది. మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌కు గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వని విషయం విదితమే. ఈ క్రమంలో సీతారాం నాయక్‌కు సీఎం ఎమ్మెల్సీ పదవి విషయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. వీరందరి కంటే ముందుగా వరంగల్ ఎంపీ ఉపఎన్నికల్లో ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్‌కు పార్టీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషయంలో పక్కనపెట్టారు. ఈ క్రమంలో సీఎం 'గుడిమల్ల' ఇంటికి స్వయంగా వచ్చి సముచితస్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీ పదవిపై 'గుడిమల్ల' ఆశలు పెట్టుకున్నారు. ఇదే క్రమంలో ఉభయ వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా గతంలో పని చేసిన తక్కళ్లపల్లి రవీందర్రావు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ పదవులపై ఉమ్మడి వరంగల్‌లో ఆశావహులు అధికంగా ఉన్నారు.
ఉద్యమ నేతలకు దక్కేనా..?
ఎమ్మెల్సీ పదవులు ఈసారైనా ఉద్యమ నేతలకు దక్కేనా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం టీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చినట్టయ్యింది. ఈ క్రమంలోనైనా సీఎం కేసీఆర్ ఉద్యమకారులకు అవకాశం కల్పిస్తారేమోనన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇవ్వడం పట్ల పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పాడి కౌశిక్‌రెడ్డి పార్టీలో చేరగానే ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం పట్ల కూడా నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. నేతలు ఎవరూ బహిరంగంగా అభిప్రాయాలను వ్యక్తం చేయకపోయినా, అంతర్గతంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.