Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిట్ ప్రొఫెసర్ రామచంద్రయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
గ్రామస్థాయిలో సైన్స్‌ను విస్తరించడమే లక్ష్యంగా జేవీవీ ముందుకు సాగుతోందని నిట్ ప్రొఫెసర్ రామచంద్రయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో లింగంపల్లి దయానంద్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన జేవీవీ జిల్లా మహాసభ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్‌తో కలిసి రామచంద్రయ్య మాట్లాడారు. ప్రజలకు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం కోసం వేదిక పాటుపడుతోందని చెప్పారు. కరోనా నిర్మూలన కోసం ప్రధాని చప్పట్లు కొట్టాలనడాన్ని, దీపాలు వెలిగించాలని సూచించడాన్ని వేదిక ఖండించిం దని చెప్పారు. డాక్టర్లను నియమించాల్సిన, మెరుగైన సేవలు అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందన్నారు. మానవ శరీరంలోని అవయవాలు సైన్స్ అనుసంధానంతో పని చేస్తాయని చెప్పారు. సైన్స్ బంధం తెగిపోతే శ్వాస ఆగిపోతుందని తెలిపారు. నాడీ కణాల ద్వారా శరీరం స్పర్శ పొందే విషయమై పరిశోధన చేసినందుకు సీవీ రామన్ నోబెల్ బహుమతి పొందాడని చెప్పారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో సజనాత్మకతను పెంపొందించేలా సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం డాక్టర్ కాలేరు సత్యనారాయణ, డాక్టర్ అనిల్ గుప్త, డాక్టర్ నెహ్రూ మాట్లాడారు. కార్యక్రమంలో జేవీవీ కోశాధికారి సాహితీ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్వాల నాగేశ్వర్రావు, గౌరవ అధ్యక్షుడు మైస నాగయ్య, మంగపతిరావు సమత కన్వీనర్ ఉమాదేవి, జిల్లా కార్యదర్శులు చొప్పరి శ్రీనివాస్, బోయినపల్లి మహేష్, తుమ్మనపల్లి వెంకన్న, మహబూబాబాద్ మండల అధ్యక్షుడు బండి నరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తేలుకుంట్ల సునీత, మంజు భార్గవి, లలిత, షాహెదా అన్వారి, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆలోచింపజేశాయి. రాష్ట్ర కమిటీ కన్వీనర్ శ్రీనాధ్ జిల్లా కమిటీ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.