Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సింహులపేట
మండలంలోని నర్సింహులపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యవర్గాన్ని మండల అధ్యక్షుడు జినుకల రమేష్ సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గ్రామ శాఖ అధ్యక్షడు అల్వాల శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం ఎన్నుకున్నారు. కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడుగా కడుదల రామకృష్ణ, ఉపాధ్యక్షుడుగా దూరు యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా దోమల యాదగిరి, కోశాధికారిగా బొల్లం సోమేశ్వర్రావు ఎన్నికయ్యారు. అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా కాసం యాకన్న, ప్రధాన కార్యదర్శిగా రేఖ అనిల్ కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడుగా ఆకుతోట సతీష్ ఎన్నికయ్యారు. ఎస్సీ సెల్ అధ్య క్షుడిగా ధర్మారపు బాబు, ఉపాధ్యక్షుడుగా కొత్త రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర రవి కుమార్, మైనార్టీ సెల్ అధ్యక్షుడుగా ఇంతియాజ్, కిసాన్ సెల్ అధ్యక్షుడుగా క్రాంతి కుమార్‌రెడ్డి, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నిమ్మల నరేష్‌ను ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు రమేష్ తెలిపారు. కిసాన్ సెల్ మండల అధ్యక్షుడుగా నెలకుర్తి మోహన్‌రెడ్డిని నియమించినట్టు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పీఏసీఎస్ డైరెక్టర్ రజినీకాంత్‌రెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు గుండగాని వెంకన్న గౌడ్, సీనియర్ నాయకులు గుండాల భిక్షం, గౌని యాదగిరి, రవీందర్‌రెడ్డి, వీరన్న నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు దసరోజు రాజశేఖర్, పొన్నం శ్రీకాంత్, ఆవుల మహేష్, సతీష్, పగిల్ల అనిల్, ఏర్పుల యాదగిరి, బాబు తదితరులు పాల్గొన్నారు.
అలవాల శ్రీనివాస్‌కు సన్మానం
పార్టీ టౌన్ కమిటీ పూర్వ అధ్యక్షుడు అలవాల శ్రీనివాస్‌ను గ్రామ శాఖ కార్యకర్తలు సన్మానించారు. శ్రీనివాస్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. పార్టీ సిద్ధాంతం కోసం పాటుపడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.