Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేణిలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించా లని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీ యూసీ) భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యా లయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎల్సీ, సీఎల్సీ ఉత్తర్వుల ప్రకా రం ఎన్ని కలు నిర్వహించాలని లేదా ఎన్నికలు నిర్వహించే వరకు జాతీయ సంఘాలకు సమాన హోదా కల్పించాలని డిమాం డ్ చేశారు. 2017లో ఎన్నికలు నిర్వహించగా రెండేండ్ల కాలపరిమితిని మాత్రమే కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి లేఖ ఇవ్వడాన్ని గుర్తు చేశారు. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు ఆ దిశగా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ సింగరేణి ఎన్నికల్లో ఓటమి పాలవుతుందనే భయంతో ఆ ఊసెత్తడం లేదని మండిపడ్డారు. సింగరేణి ఎన్నికలు నిర్వహించకపోతే కార్మికుల, కార్మిక సంఘాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశం లో నాయకులు పసునూటి రాజేందర్, రఘుపతిరెడ్డి, బ్రాంచ్ నాయకులు రాములు, మైదుకూరు రెడ్డి, అశోక్, లక్ష్మీనారాయణ, రవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.