Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మండలంలోని పోడుభూముల దరఖాస్తులపై, వారసత్వ హక్కు పట్టాదారు పాసుపుస్తకాల మంజూరుపై మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో చైర్మెన్ మూల మధూకర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గిరిజనులు 2005వ సంవత్సరం వరకు 18 ఏండ్లు నిండిన వారు పోడు భూముల హక్కు పత్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గిరిజనేతరులు 2005 నాటికి 75 ఏండ్లు నిండి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చనే అంశంపై చర్చించి గిరిజనులకు ఏ విధంగా నిబంధన ఉన్నదో అదే విధంగా గిరిజనేతరులకు కూడా అవకాశం కల్పించాలని సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో వారసత్వ భూములు వారసులు పట్టాదారులుగా రావడం లేదనే అంశంపై చర్చించి ఏ రైతు అయితే సాగులో ఉన్నారో సాగులో ఉన్న ప్రతి రైతు గిరిజనులు, గిరిజనేతరులు పట్టాదారు కాలంలో చేర్చేలా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. సమావేశంలో అఖిలపక్ష పార్టీల నాయకులు శ్రీకాంత్ నాయక్, జర్పుల శ్రీను, వీరబోయిన సంపత్, మండ రాజన్న, నంబూరి మధు, కంబాల ముసలయ్య, నాని శ్రీనివాస్‌రెడ్డి, సారిక శ్రీను, కళింగరెడ్డి, వీసం వెంకటేశ్వర్లు, నామ బాబురావు, ఎస్కే మదార్, జగ్గన్న, బిల్లకంటి సూర్యం, నందగిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.