Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
విధుల దుర్విని యోగానికి పాల్పడ్డ అంగన్వాడీ టీచర్‌పై చర్యలు తీసుకోవాలని బాలాజీనగర్ సర్పంచ్ ఇస్లావత్ మౌనిక వినోద్ అన్నారు. బాలాజీనగర్ అంగన్ వాడీ సెంటర్‌ను ఆదివారం ఆమె తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. అంగన్వాడీ టీచర్ లకావత్ రాజేశ్వరి పిల్లలకు, తల్లులకు, గర్భిణులకు, బాలింతలకు సరుకులు ఇవ్వడంతో అవకతవకలకు పాల్పడుతోందని చెప్పారు. రిజిస్టర్‌ను ఫోర్జరీ సంతకాలు పెడుతూ సరుకులు మాయం చేస్తోందని ఆరోపించారు. ఐసీడీఎస్ సీడీపీఓ విచారణలోనూ విమర్శలు వాస్తవమని తేలినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్, కార్యదర్శి అల్లం రోజా, వార్డు సభ్యులు భూక్య సారయ్య, అజ్మీరా రమేష్, లకావత్ స్వాతి శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.