Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
స్థానిక మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన పాలకవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్‌పర్సన్‌గా పసుమర్తి శాంత, విజరుకుమార్, ఉప్పలయ్య, కిషోర్, అర్జున్ రాజు, రవినాయక్, వెంకటరమణ, రవీందర్‌రెడ్డి, రామ ఉపేందర్, కూరపాటి సోమయ్య ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీలు మాలోత్ కవిత, దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, జెడ్పీ చైర్పర్సన్ బిందు హాజరవుతారని పేర్కొన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.